సేంద్రీయ వ్యవసాయం

సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) అనగా ఎటువంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం. సేంద్రీయ వ్యవసాయము రెండు పద్ధతులు ఉంది.

మొదటి పద్ధతిలో కేవలం ప్రకృతి సిద్ధమైన ఎరువులు, అనగా ఎండిన ఆవు/గేదె పేడ, ఆకు తుక్కు, వర్మీ కంపోస్టు (వానపాముల విసర్జన), వేప పిండి వంటి పదార్ధాలు వాడి పంటలు పండించడం జరుగుతుంది. ఇది సాధారణ పద్ధతి. ఈ పద్ధతి కేరళ మరియూ ఈశాన్య రాష్ట్రాల్లో కొనసాగుతున్నది. సేంద్రీయ వ్యవసాయంలో సిక్కిం ముందు స్థానంలో ఉంది.

రెండవ పద్ధతిని గో-ఆధారిత పద్ధతి లేదా సుభాష్ పాలేకర్ పద్ధతి అని అందురు. ఈ పద్ధతిలో సేంద్రీయ వ్యవసాయం జీవామృతం అను సహజ రసాయనంతో సాగుతుంది. ఇక కీటక నాశానులుగా నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం అను సహజ రసాయనాలు వాడబడతాయి.

(వ్యాసము విస్తరణలో ఉంది. ఎవరైనా ఈ వ్యాస విస్తరణకు సహకరించవచ్చు)

ఇవీ చూడండి

Other Languages
हिन्दी: जैविक खेती
മലയാളം: ജൈവകൃഷി
العربية: زراعة عضوية
অসমীয়া: জৈৱিক কৃষি
български: Биоземеделие
Bahasa Indonesia: Pertanian organik
日本語: 有機農業
한국어: 유기농
Bahasa Melayu: Pertanian organik
မြန်မာဘာသာ: အော်ဂဲနစ်
नेपाली: जैविक खेती
ਪੰਜਾਬੀ: ਜੈਵਿਕ ਖੇਤੀ
srpskohrvatski / српскохрватски: Organska poljoprivreda
Simple English: Organic farms
slovenščina: Ekološko kmetijstvo
српски / srpski: Organska poljoprivreda
Türkçe: Organik tarım
Tiếng Việt: Nông nghiệp hữu cơ
中文: 有機農業
Bân-lâm-gú: Iú-ki lông-gia̍p