సంగీత వాయిద్యం

సంగీత వాయిద్యం . సూత్రబద్ధంగా, ధ్వనిని జనింపచేసే ఏదైనా సంగీత వాయిద్యంగా ఉపయోగపడుతుంది. సంగీత వాయిద్యాల చరిత్ర మానవ సంస్కృతి ప్రారంభంతోనే మొదలవుతుంది. సంగీత వాయిద్యాల శాస్త్రీయ అధ్యయనాన్ని ఆర్గనాలజి అంటారు.

సంగీత వాయిద్యంగా వివాదాస్పద గుర్తింపు పొందిన మొదటి పరికరం 67,000 సంవత్సరాల పురాతనమైనది; పూర్వ చారిత్రిక వస్తుజాలంగా సాధారణంగా అంగీకరింపబడిన పురాతన వేణువు దాదాపు 37,000 సంవత్సరాలనాటిది. ఏమైనప్పటికీ, నిర్వచనం యొక్క కేంద్రభావన సంక్లిష్టత వల్ల సంగీత వాయిద్యం యొక్క ప్రత్యేక కాలాన్ని నిర్ణయించడం అసంభవమని అత్యధిక చరిత్రకారుల అభిప్రాయం.

ప్రపంచపు అధిక జనసాంద్రత ప్రాంతాలలో సంగీతవాయిద్యాలు విడివిడిగా అభివృద్ధి చెందాయి. ఏమైనప్పటికీ, నాగరికతల మధ్య సంబంధాల ఫలితంగా ఇవి వాటి జన్మస్థానంనుండి సుదూరంగాఉన్న ప్రాంతాలలో కూడా వేగంగా వ్యాప్తిచెంది ఉపయోగించబడ్డాయి. మధ్య యుగాల నాటికల్లా, మెసపొటోమియా యొక్క పరికరాలు మలయ్ ద్వీపసమూహం లోను మరియు ఉత్తర ఆఫ్రికా వాయిద్యాలు యూరోపియన్లచేత వాడబడ్డాయి. అమెరికాలలో అభివృద్ధి మందగమనంలో సాగినా, ఉత్తర, మధ్య, మరియు దక్షిణ అమెరికాలు సంగీత వాయిద్యాలను మాత్రం పంచుకున్నాయి.

పురావస్తుశాస్త్రం

సంగీత వాయిద్యాలను మొదటిసారిగా ఎవరు, ఎప్పుడు అభివృద్ధి చేసారనేదాని అన్వేషణలో, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వివిధ సంగీత వాయిద్యాల యొక్క పురావస్తు ఆధారాలను పరిశోధకులు కనుగొన్నారు. వారు కనుగొన్న వాటిలో కొన్ని 67,000 సంవత్సరాల పురాతనమైనవి, కానీ సంగీత వాయిద్యాలుగా వాటి గుర్తింపు వివాదాస్పదంగా ఉంది. సుమారు 37,000 సంవత్సరాల పూర్వం మరియు ఆతరువాత లభించిన పురావస్తువులపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. కేవలం మన్నికైన పదార్ధాలు లేదా మన్నికైన పద్ధతుల ద్వారా తయారుచేయబడిన పురావస్తువులు మాత్రమే నిలిచిఉంటాయి. ఆవిధంగా, కనుగొన్న నమూనాలను మొట్టమొదటి సంగీత వాయిద్యాలుగా ఖండితంగా పేర్కొనలేము.[1]

దస్త్రం:Image-Divje01.jpg
బాబ్ ఫింక్ చే వివాదాస్పదమైన వేణువు యొక్క చిత్రణ

జూలై 1995, స్లోవేనియాకు చెందిన పురావస్తుశాస్త్రవేత్త ఇవాన్ టర్క్ స్లోవేనియా యొక్క వాయవ్య ప్రాంతంలో ఒక చెక్కిన ఎముకను కనుగొన్నారు. దివ్జే బాబే ఫ్లూట్ గా పిలువబడే ఈ చెక్కుపని వస్తువు యొక్క నాలుగు రంధ్రాలు ద్విస్వర ప్రమాణం యొక్క నాలుగు స్వరాలు పలికించటానికి వాడబడినట్లుగా కెనడా సంగీతశాస్త్రవేత్త బాబ్ ఫింక్ నిర్ణయించారు. పరిశోధకులు ఈ వేణువు వయసు 43,400 మరియు 67,000 సంవత్సరాల మధ్యఉంటుందని అంచనావేయటంతో, ఇది అత్యంత పురాతన సంగీత వాయిద్యంగా మరియు నియాన్డెర్తల్సంస్కృతితో సంబంధం కలిగిన ఏకైక వాయిద్యంగా నిలిచింది.[2] ఏమైనప్పటికీ, కొంతమంది పురాతత్వవేత్తలు ఈ వేణువుకి ఒక సంగీత వాయిద్యపు స్థాయిని ప్రశ్నిస్తారు.[3] జర్మన్ పురాతత్వ శాస్త్రవేత్తలు స్వాబియన్ అల్బ్లో దాదాపు 30,000 నుండి 37,000 సంవత్సరాలనాటివిగా భావించే ఒక ఏనుగు వంటి పెద్ద పరిమాణంగల జంతువు యొక్క ఎముక మరియు హంస ఎముక వేణువులను కనుగొన్నారు. ఈ వేణువులు ఎగువ పేలియోలిథిక్ కాలంలో తయారుకాబడినవి, మరియు సాధారణంగా మనకు తెలిసిన అత్యంత పురాతన సంగీత వాయిద్యాలుగా అంగీకరించబడ్డాయి.[4]

సంగీత వాయిద్యాల పురాతత్వ ఆధారాలు సుమేరియా నగరమైన ఉర్ ( లైర్స్ అఫ్ ఉర్ చూడుము) లో రాయల్ సిమెట్రీ వద్ద జరిపిన త్రవ్వకాలలో లభించాయి. ఈ వాయిద్యాలలో తొమ్మిది వీణ వంటి వాయిద్యాలు, రెండు అనేక తీగలుగల తంత్రీవాద్యాలు, ఒక వెండి ద్విముఖ వేణువు, పురాతన తంత్రీవాద్యం మరియు కంచు తాళములు ఉన్నాయి. ఆధునిక బాగ్ పైప్ లకు పూర్వరూపమనదగిన పీకతో ధ్వనించే వెండిగొట్టాల సముదాయాన్ని ఉర్ లో కనుగొన్నారు.[5] ఈ స్థూపాకారపు గొట్టాలకు మూడు పక్క రంధ్రములు అన్ని స్వర ప్రమాణాలను పలికించగలిగేవిగా ఉంటాయి.[6] 1920లలో లియోనార్డ్ వూలెచే జరుపబడిన ఈతవ్వకాలలో, శిథిలం-కాని వాయిద్య భాగాలు మరియు శిథిలమైన భాగాల ఖాళీలు, రెంటినీ కలిపి, వాటిని తిరిగి నిర్మించేటట్లుగా లభించాయి.[7] ఈ వాయిద్యాలతో సంబంధం కలిగిన సమాధులు క్రీస్తు పూర్వం 2600 మరియు 2500 మధ్యకాలానివిగా కార్బన్ డేటింగ్ చే నిర్ధారించబడి, ఈ కాలానికే ఇవి సుమేరియాలో వాడారనటానికి సాక్ష్యంగా ఉన్నాయి.[8]

మెసపొటేమియాలోని నిప్పూర్కి చెందిన క్రీస్తుపూర్వం 2000నాటి క్యూనిఫారం (చెక్కబడిన చిహ్నాలు) పలక, వీణపై ఉన్న తంత్రుల పేర్లను సూచిస్తూ సంగీత రచన యొక్క అతి పురాతన ఉదాహరణగా ఉంది.[9]

Other Languages
Afrikaans: Musiekinstrument
Alemannisch: Musikinstrument
العربية: آلة موسيقية
azərbaycanca: Musiqi aləti
беларуская (тарашкевіца)‎: Музычны інструмэнт
bamanankan: Fɔlifɛn
བོད་ཡིག: རོལ་ཆ།
brezhoneg: Benveg-seniñ
Cymraeg: Offeryn cerdd
Ελληνικά: Μουσικό όργανο
euskara: Musika tresna
فارسی: ساز
suomi: Soitin
Võro: Pill
Gaeilge: Uirlis cheoil
贛語: 樂器
Gàidhlig: Innealan-ciùil
ગુજરાતી: સંગીત વાદ્ય
עברית: כלי נגינה
hrvatski: Glazbala
magyar: Hangszer
Bahasa Indonesia: Alat musik
íslenska: Hljóðfæri
日本語: 楽器
la .lojban.: zgitci
Basa Jawa: Piranti musik
한국어: 악기
Lëtzebuergesch: Museksinstrument
lingála: Eyémbeli
Bahasa Melayu: Alat muzik
မြန်မာဘာသာ: တူရိယာ
Nāhuatl: Tlatzotzonalli
Plattdüütsch: Musikinstrument
नेपाल भाषा: बाजं
Nederlands: Muziekinstrument
norsk nynorsk: Musikkinstrument
ਪੰਜਾਬੀ: ਸਾਜ਼
پښتو: ساز
Runa Simi: Waqachina
armãneashti: Hâlati muzicalâ
संस्कृतम्: वाद्ययन्त्राणि
srpskohrvatski / српскохрватски: Muzički instrumenti
Simple English: Musical instrument
slovenčina: Hudobný nástroj
slovenščina: Glasbilo
Soomaaliga: Qalab muusig
Seeltersk: Musikinstrumente
Türkçe: Çalgı
oʻzbekcha/ўзбекча: Musiqa asbobi
Tiếng Việt: Nhạc cụ
West-Vlams: Muziekinstrument
吴语: 乐器
中文: 乐器
Bân-lâm-gú: Ga̍k-khì
粵語: 樂器