వికీపీడియా:నిర్ధారత్వం

WP:V
Nutshell.pngసంక్షిప్తంగా ఈ పేజీలోని విషయం: ప్రశ్నింపబడిన, లేదా ప్రశ్నింపబడే అవకాశం ఉన్న విషయాలన్నింటికీ, మరియు కొటేషన్లకు విశ్వసనీయమైన, ఇంతకుముందు ప్రచురింపబడిన ఆధారాలు చూపాలి

ఏదైనా విషయాన్ని వికీపీడియాలో వ్రాయవచ్చునా అనే సమస్యకు ప్రామాణికత - నిజం మాత్రమే కాదు, నిర్ధారింప తగినది (verifiability, not truth). అంటే వికీపీడియాలో ఉంచిన విషయాలు ఇంతకు ముందే విశ్వసనీయమైన ప్రచురణలలో వెలువడి ఉండాలి. ఇది నిజం అనుకుంటే చాలదు. ముఖ్యంగా వివాదాస్పదం కావచ్చుననిపించే విషయాలకు, లేదా ఇతరులు ప్రశ్నించిన విషయాలకు విశ్వసనీయమైన మూలాలు చూపడం చాలా అవుసరం. అలా చూపలేని పక్షంలో ఆ విషయాలను తొలగించాలి ({{fact}} (ఆధారం చూపాలి అని వస్తుంది) అనే మూస తగిలించి వదిలేస్తే చాలదు.)

వికీపీడియా:నిర్ధారింప తగినది అనేది వికీపీడియా రచనలకు వర్తించే మూడు మౌలిక సూత్రాలలో ఒకటి. తక్కిన రెండు వికీపీడియా:తటస్థ దృక్కోణం మరియు వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం - ఈ మూడు సూత్రాలు వికీపీడియాలో ఉంచదగిన విషయం మౌలిక పరిధులను నిర్దేశిస్తాయి. ఈ మూడు సూత్రాలను దేనికదే విడివిడిగా కాక సంయుక్తంగా, విచక్షణతో అమలు చేయాలి.

Other Languages
беларуская (тарашкевіца)‎: Вікіпэдыя:Магчымасьць праверкі
Bahasa Indonesia: Wikipedia:Pemastian
Baso Minangkabau: Wikipedia:Pamastian
Bahasa Melayu: Wikipedia:Pengesahan
srpskohrvatski / српскохрватски: Wikipedia:Proverljivost
Simple English: Wikipedia:Verifiability