తూర్పు కనుమలు

తూర్పు కనుమలు మరియు భారత భౌగోళికం.

తూర్పు కనుమలు (ఆంగ్లం Eastern Ghats) భారత ద్వీపకల్పానికి తూర్పు సముద్ర తీరం వెంట ఉండే కొండల వరుస.

ఇవి ఉత్తరంగా పశ్చిమ బెంగాల్ నుండి, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ ద్వారా దక్షిణంగా తమిళనాడు రాష్ట్రాలలోనికి వ్యాపించాయి. ఇవి మహానది, గోదావరి, కృష్ణా నది మరియు కావేరి నదుల ప్రవాహం వలన వేరుచేయబడ్డాయి. ఇవి బంగాళఖాతం సముద్రానికి సమాంతరంగా వ్యాపించాయి. వీని మధ్య ప్రదేశాన్ని కోస్తా ప్రాంతం అంటారు. దక్కను పీఠభూమి తూర్పు మరియు పడమర కనుమల మధ్యగా విస్తరించి ఉంది. పడమటి కనుమల కన్నా తూర్పు కనుమల ఎత్తు తక్కువగా ఉంటాయి.

దక్షిణ బాగాన తూర్పు కనుమలు విడిపొయి చిన్న చిన్న పర్వత శ్రేణులుగా విస్తరించి వుంటాయి. తూర్పు కనుమల యొక్క దక్షిణ చివరి భాగం తమిళనాడులోని సిరుమలై మరియు కరన్ తమలై అనె పర్వతశేణితో ముగుస్తుంది. కావేరి నది ఉత్తరాన కొల్లి హిల్స్ (కొల్లమలై), పంచమలై హిల్ల్స్ షెవరోయ్ హిల్స్, సెర్వరోయన్, కల్ రాయన్ హిల్స్, చిత్తేరి, పల్లమలై మరియు మెత్తుర్ హిల్స్ అనె ఎత్తైన పర్వతాలు (తూర్పు కనుమలు) ఉత్తర తమిళనాడులో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ కొండలు పైన ఉష్ణోగ్రతలు చుట్టు ప్రక్కల ప్రదేశాల కంటే చల్లగాను తేమగాను వుంటాయి. ఈ ప్రదేశాల్లో కాఫీ తోటలు మరియు అడవులు ఉంటాయి.యార్కడ్ షెవరాయ్ కొండలలో ఉంది. బిల్గిరి కొండలు పశ్చిమ కనుమల నుండి కావేరి నది వెంబడి తూర్పు కనుమలను కలుస్తాయి. తూర్పు మరియు పశ్చిమ కనుమలు మధ్య ఈ ప్రాంతము ఒక జీవ వైవిధ్య మనోహర ప్రదేశముగా భాసిల్లుతున్నది. అలాగే భారతదేశంలో ఏనుగుల సంచారం కలిగిన రెండవ అతి పెద్ద ప్రాంతంగా ఉంది.

తమిళనాడులో తూర్పుకనుమలు

పొన్నాయర్ మరియు పలర్ నదులు కర్నాటకలోని కోలార్ పీఠభూమి నుండి తూర్పున బంగాళాఖాతంలో కలుస్తాయి, తూర్పు కనుమలలో భాగమైన జవధు కొండలు ఈ రెండు నదుల మధ్య ఉన్నాయి.ఈ కొండలలో కిలియుర్ జలపాతము[1] కలదుపలర్ నదికి ఉత్తరాన ఆంధ్రప్రదేశ్ లో తూర్పుకనుమల మధ్య భాగం ఉంది. ఇవు రెండు సమాంతర కొండలుగా ఉన్నాయి. ఒకటి వెలికొండ రేంజి కాగా మరొకటి పాలికొండ-లంకమల్ల-నల్లమల రేంజి. వెలికొండ రేంజి నెల్లూరు వైపుగా కోస్తా ప్రాంతములో ఉంటుంది. నల్లమల కొండలు కృష్ణా నది వెంబడి యేర్పడ్డాయి. కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో ఈ కొండలు తక్కువ ఎత్తులో ఉంటాయి, గోదావరి నది యొక్క ఉత్తర బాగాన తూర్పు కనుమలు ఎత్తుగా ఉంటాయి.ఈ ప్రాంతం అంతా సారవంతమైన భూమి కలిగి ఉంది. పశ్చమ కనుమలలో లాగ ఇక్కడ జలవిద్యుచ్ఛక్తికి అనువైనది కాదు.తూర్పు కనుమలు పశ్చమ కనుమల కన్నా పురాతనమైనవి. ఇవి రెండు ఖండాలు విడిపోయినప్పూడు ఏర్పడినవి. (రోడినియా మరియు గోండ్వాణ)తూర్పు కనుమలలో అనేక భౌగోళిక అద్భుత ప్రాంతాలు ఉన్నాయి. అందులో కొన్ని

  • తిరుమల-తిరుపతి కొండలు
  • ఎర్రమల కొండలు
  • నల్లమల కొండలు
  • మధురవాడ డోము[2]
విశాఖ జిల్లాలోని పాడేరు వద్ద తూర్పు కనుమలు
తూర్పు కనుమలలో ఉన్న అరకులోయ

ఇవి కూడా చూడండి

Other Languages
English: Eastern Ghats
हिन्दी: पूर्वी घाट
भोजपुरी: पूरबी घाट
বাংলা: পূর্ব ঘাট
čeština: Východní Ghát
Deutsch: Ostghats
Esperanto: Orientaj Ghatoj
eesti: Ida-Ghatid
français: Ghats orientaux
ગુજરાતી: પૂર્વ ઘાટ
italiano: Ghati orientali
한국어: 동고츠산맥
lietuvių: Rytų Ghatai
मराठी: पूर्व घाट
Nederlands: Oost-Ghats
norsk: Øst-Ghat
ਪੰਜਾਬੀ: ਪੂਰਬੀ ਘਾਟ
پنجابی: چڑدے گھاٹ
português: Gates Orientais
українська: Східні Гати
oʻzbekcha/ўзбекча: Sharqiy gat togʻlari
Tiếng Việt: Ghat Đông
მარგალური: ბჟაეიოლი გატეფი