ఇస్లాం పూర్వపు అరేబియా

ఇస్లాం పూర్వపు అరేభియా : క్రీ.శ. 610లో అరేబియాలో ఇస్లాం ఆవిర్భవించింది. దీనికి పూర్వపు అరేబియా చరిత్ర, పురాతత్వశాస్త్రం, సాంప్రదాయిక చరిత్రలు, గ్రంథాల ఆధారంగా ప్రామాణికంగా గుర్తింపబడింది. ఈ చరిత్రలో ఇస్లామీయ స్కాలర్ల కృషి ఎక్కువ.క్రీ.పూ 9వ శతాబ్దానికి చెందిన పురాతన దక్షిణ అరేబియా, ఉత్తర అరేబియా చరిత్రలు వెలుగులోకి వచ్చాయి. క్రీ.శ.3వ శతాబ్దంలో హిమ్యారైట్ ల చరిత్ర ఖహ్తానీయుల చరిత్రల ఆధారంగా చరిత్ర వెలుగులోకి వచ్చింది.